కృష్ణా జలాల వివాదం : ఏపీ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ : కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కృష్ణా ట్రైబ్యునల్ లో నదీ పరివాహకంలో ఉన్న మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నాలుగు రాష్ట్రాల వాదనలను మొదటి నుంచి వినాలని పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఐతే… మొదటి నుంచి వినడం కుదరదని చెప్పింది సుప్రీంకోర్టు. గతంలో ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను తోసిపుచ్చామన్న సంగతిని ధర్మాసనం గుర్తుచేసింది. గతంలో ఏపీ విభజన చట్టం ప్రకారం.. విడిపోయిన తెలుగు రాష్ట్రాల మధ్య వాదనలు వింటే సరిపోతుందన్న కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం సమర్థించింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇచ్చిన తీర్పును మరోసారి వివరించింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో… కృష్ణా నదీ జలాల పంపిణీపై ట్రైబ్యునల్ లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య యధావిధిగా వాదనలు కొనసాగనున్నాయి.

Posted in Uncategorized

Latest Updates