కృష్ణ బర్త్ డే గిఫ్ట్ : సమ్మోహనం ట్రైలర్

SAMMOHANAMనేడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. పుట్టినరోజు సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు కొత్త సినిమాకి సంబంధించిన, ట్రైలరో, టీజరో, ఫస్ట్ లుక్ లాంటివి రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి మహేష్ బాబు సినిమా ఏదీ లేకపోవడంతో కృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన సుధీర్ బాబు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి, సూపర్ స్టార్ కు గిఫ్ట్ గా అందించారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సమ్మోహనం మూవీ ట్రైలర్ ను గురువారం ( మే-31) ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు హీరో సుధీర్. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన అదితీరావు హీరోయిన్ గా నటిస్తుంది.

నిమిషం 50 సెకన్లున్న ఈ ట్రైలర్ లో హీరో సుధీర్ డైలాగ్ తో అదరగొట్టాడు. స్టార్ల గ్లామర్ అబద్దం..నటన అబద్దం..మాటలు అబద్దం అయినా అమ్మాయిలు పడిపోతారేంట్రా అనే డైలాగ్ తో ప్రారంబించాడు. స్టార్లు మామూలు మనుషులు కాదు..మనం డబ్బులు ఇచ్చి సినిమాలకు వెళ్తున్నామంటే వారిలో ఏదో ఉంది అని మరో డైలాగ్ ఆకట్టుకుంది. హీరోయిన్ అదితీ గ్లామర్ గా కనిపించింది. ఈ సినిమా వాళ్ల మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పనుకున్నాను .. నిన్ను కలిసిన తరువాత. కాదని చెంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావ్ అంటూ సుధీర్ బాబు ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 15 రిలీజ్ కానున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.


Posted in Uncategorized

Latest Updates