కెనడాలో అవమానం : సెక్స్ రాకెట్ కేసులో హీరోయిన్ మెహరీన్ విచారణ

Mehreenఅమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ నడిపిన కిషన్ మోదుగుమూడి వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. అమెరికాలో అడుగుపెట్టాలంటేనే టాలీవుడ్ నటీనటుడు వణికిపోతున్నారు. ఎయిర్ పోర్ట్ లోనే విచారణ చేస్తున్నారు. ప్రశ్నలతో ఉక్కికిబిక్కిరి చేస్తున్నారు. ఇలాంటి అనుభవమే హీరోయిన్ మెహరీన్ కు ఎదురైంది. రెండు రోజుల క్రితం కెనడా వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ను.. టొరంటో ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఎందుకు వచ్చారు.. ఏ పనిపైన వచ్చారు.. ఎవర్ని కలవబోతున్నారు.. ఎక్కడ ఉండబోతున్నారు.. ఇలాంటి ప్రశ్నలను సంధించారు. అన్నింటికీ ఒపిగ్గా సమాధానం చెప్పిన మొహరిన్.. ఎందుకు విచారిస్తున్నారో తెలుసుకోవచ్చా అని ఎదరు ప్రశ్న వేశారు. దీనికి సమాధానంగా కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి షాకింగ్ సమాదానం వచ్చింది. చికాగోలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ నడిపిన కిషన్ మోదుగుమూడి వెల్లడించిన వివరాలు, అతని వ్యవహారం ఆధారంగా ఈ ప్రశ్నలు అడగటం జరిగిందని సమాధానం చెప్పారు అధికారులు.

ఈ వ్యవహారంపై మెహరీన్ స్పందించారు. తెలుగు నటీమణులపై, హీరోయిన్స్ పై అమెరికా, కెనడాలో వారికి ఉన్న అభిప్రాయం ఏంటో తెలుస్తుందన్నారు. వారి ప్రశ్నలకు ఎంతో ఇబ్బందిగా సమాధానం చెప్పటం జరిగిందన్నారు. తెలుగు యాక్టర్ అని చెప్పటం వల్లే 30 నిమిషాలు ప్రశ్నించారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనకు ఎలాంటి సంబంధం లేదని నిర్థారించుకున్న కెనడా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారులు.. క్షమాపణలు చెప్పి బయటకు పంపించినట్లు వెల్లడించారు. నా తల్లిదండ్రులు అక్కడే ఉన్నారని.. వారిని కలవటానికే అక్కడికి వెళ్లినట్లు తెలిపారామె. అంతర్జాతీయంగా తెలుగు నటీమణుల విలువ ఏ విధంగా ఉందో అర్థం అవుతుంది ఆవేదన వ్యక్తం చేసింది మెహరీన్..

 

Posted in Uncategorized

Latest Updates