కెప్టెన్ గా కోహ్లీ మరో రికార్డ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత తక్కువ ఇన్నింగ్స్ (49)లో 3 వేల పరుగులు చేసిన ఫస్ట్ కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. మంగళవారం (జూలై-17) ఇంగ్లాండ్‌ తో మూడో వన్డేలో అతడు ఈ ఫీట్‌ ను సాధించాడు. వన్డేల్లో కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మార్క్‌ను అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.

అతి తక్కువ వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. కోహ్లీ 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ చేరుకొని సత్తాచాటాడు. ప్రస్తుతం కోహ్లీ 52వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు.
రన్ మెషిన్ విరాట్ తరువాత ఏబీ డివిలియర్స్(60 ఇన్నింగ్స్‌ల్లో, సౌతాఫ్రికా), మహేంద్రసింగ్ ధోనీ(70, భారత్), సౌరభ్ గంగూలీ(74, భారత్), గ్రేమ్ స్మిత్(83, సౌతాఫ్రికా), మిస్బా హుల్ హక్(83, పాకిస్థాన్), సనత్ జయసూర్య(84, శ్రీలంక), రికీ పాంటింగ్(84, ఆస్ట్రేలియా) జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates