కేంద్రంపై అవిశ్వాసం…శుక్రవారం చర్చ

కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని  స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆమోదించారు. దీనిపై ఈ శుక్రవారం (జూలై-20) చర్చ చేపట్టనున్నట్లు బీఏసీ సమావేశంలో తెలిపారు. ఆ రోజు ప్రశ్నోత్తరాలు రద్దు చేసి అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (జూలై-23) రాజ్యసభలో ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని  టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవేశపెట్టారు. తీర్మానంపై చర్చకు విపక్ష సభ్యులు 50 మందికిపైగా సభ్యులు మద్దతుగా లేచి నిలబడటంతో స్పీకర్‌ ఆమోదించారు.

Posted in Uncategorized

Latest Updates