కేంద్రంపై కోర్టులో పిటీషన్ : మన వాట్సాప్ మెసేజ్ లను చదివేస్తున్నారు

సోషల్ మీడియా హబ్ ను ఏర్పాటు చేసి.. దాని ద్వారా నెటిజన్ల ఆన్ లైన్ డేటాపై నిఘూ పెట్టాలని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేశారు తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.  ఈ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి నోటీసులు పంపింది. సోషల్ మీడియా (ట్విట్టర్, ఫేస్ బుక్, ఈమెయిల్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్) నెటిజన్ల మెసేజ్ లపై నిఘూ పెట్టాలని తీసుకున్న నిర్ణయంపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఈ విషయంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్  సహాయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. ప్రజల వాట్సాప్ మెసేజ్ లను కేంద్ర ప్రభుత్వం ట్యాప్ చేయాలనుకుంటుదని.. ఇది ఓ నిఘూ వ్యవస్ధను క్రియేట్ చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది.

ప్రజల డిజిటల్ అండ్ సోషల్ మీడియా కంటెంట్ ను కలెక్ట్ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ హబ్ పై అర్జెంట్ గా స్టే ఇవ్వాల్సిందిగా దాఖలైన పిటీషన్ ను జూన్-18 అపెక్స్ కోర్టు తిరస్కరించింది. ప్రజల సోషల్ మీడియా అకౌంట్లపై ప్రభుత్వం నిఘూ పెట్టడానికి తీసుకుంటున్న చర్యలపై పలువురు నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల తమ ప్రైవసీకి భంగం వాటిళ్లుతుందని వారు చెబుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates