కేంద్రంలో మోడీ.. రాష్ట్రంలో కేటీఆర్

ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగి.. ప్రభుత్వాలను ఏర్పాటు చేయనున్నాయి. ఇప్పటికే తెలంగాణ లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మిజోరాం సీఎం గా  జోరాంతంగ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

దీంతో పాటే.. రానున్న 2019 ఎన్నికలకు ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్ గా నిలిచాయని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం రాజకీయ నాయకుల మధ్యే కాకుండా ప్రజల మధ్య కూడా మాటల తూటాలు పేలాయి. ఇందుకుగాను ట్విటర్ ఇండియా ఓ ప్రకటన చేసింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు గాను దేశ వ్యాప్తంగా #IndiaElections2018 అనే హ్యాష్ ట్యాగ్ తో  70 లక్షల ట్వీట్లను చేశారని తెలిపింది. జాతీయ స్థాయిలో ఎక్కువగా ప్రధాని మోడీ ని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారని తెలిపింది. మోడీ తరువాత స్థానాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ రెండవ స్థానంలో.. అమిత్ షా మూడవ స్థానంలో.. యూపీ సీఎం నాలుగవ స్థానంలో.. అకిలేశ్ యాదవ్ ఐదవ స్థానంలో నిలిచారు.

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ను ప్రస్తావిస్తూ ట్వీట్లు చేశారని ట్విట్టర్ ఇండియా తెలిపింది. కేటీఆర్ తరువాత స్థానాల్లో వరుసగా.. ఎంఐఎం చీఫ్ అసదుద్దిన్ ఓవైసీ రెండవ స్థానంలో నిలువగా.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడవస్థానంలో.. రాష్ట్ర బీజేపీ చీఫ్ డా.లక్ష్మణ్ నాలుగవ స్థానంలో నిలిచినట్లు ట్విట్టర్ తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates