కేంద్రం అనుమతిస్తే..పాక్ తో మ్యాచ్ లకు భారత్ సై : రాజీవ్ శుక్లా

ముంబై: కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే పాక్ తో రెండు సీరీస్ లకు భారత్ సిద్ధంగా ఉందన్నారు IPL చైర్మన్ రాజీవ్ శుక్లా. పాకిస్థాన్‌ తో క్రికెట్ సంబంధాలపై స్పందించారు శుక్లా. ఆ దేశ బోర్డుతో ఉన్న వివాదాన్ని రెండు బోర్డుల అధికారులు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ICC చుట్టూ తిరిగే కంటే ఇదే మంచిదన్నారు. పాకిస్థాన్‌ తో క్రికెట్ ఆడాలని తమకూ ఉందని, అయితే కొన్ని అంశాల కారణంగా దీనికి భారత ప్రభుత్వ అనుమతి కావాలని చెప్పారు శుక్లా.

ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ మ్యాచ్‌ లు నిర్వహించినా.. పాకిస్థాన్‌ తో ఇండియా ఆడుతూనే ఉందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఏషియాకప్‌ లో భాగంగా పెద్ద స్టేడియాల్లో ఆడామని తెలిపారు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించే ప్రసక్తే లేదని చెప్పారు శుక్లా. 2014లో రెండు దేశాల బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇండియా, పాకిస్థాన్ మధ్య ఇప్పటికే రెండు సిరీస్‌ లు జరగాల్సి ఉందని.. అయితే రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో భారత ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదన్నారు. దీంతో నష్టపరిహారంగా తమకు 7 కోట్ల డాలర్లు BCCI నుంచి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ.. పాక్ బోర్డు ICC దగ్గరికి వెళ్లిందని చెప్పారు రాజీవ్ శుక్లా.

 

 

Posted in Uncategorized

Latest Updates