కేంద్రం ఆలోచన : రేషన్ సరుకు.. హోం డెలివరీ

ration-item-home-deliveyరేషన్ షాపు.. ఇప్పటికే సబ్సిడీ సరుకులు అందించే దుకాణం అనే పేరు నుంచి.. సూపర్ మార్కెట్ స్థాయికి దాన్ని పెంచేస్తున్నారు. ఆకలి తీర్చే సబ్సిడీ దుకాణానికి ఆర్భాటాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రేషన్ షాపుల సర్వీస్ ను మరింత విస్తరించటంతోపాటు.. మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ సరుకు పక్కదారి పట్టకుండా, లబ్ధిదారులకే చేరే విధంగా.. నేరుగా ఇంటికే పంపిణీ చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సలహాలు, సూచనలు కోరుతోంది. దుకాణానికి వచ్చి సరుకు తీసుకెళ్లలేని వృద్ధుల సౌలభ్యం కోసం మొదటగా హోం డెలివరీ సౌకర్యం తీసుకురావాలని భావిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ గా 70ఏళ్ల పైబడిన వృద్ధుల ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు అందించాలి. విడదల వారీగా అందరికీ హోం డెలివరీ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే రేషన్ సరుకులు  అందకపోవడంతో ఆకలిచావులు సంభవించకుండా చూడాలని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు చేశారు.

రేషన్ షాపు ద్వారా రాయితీతో అందించే ఆహార ధాన్యాలను లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకే చేర్చాలని రాష్ట్రాలకు సూచించామన్నారు కేంద్ర ఆహారశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్. వరుసగా మూడు నెలలు రేషన్‌ సరకులను తీసుకెళ్లని వారిపై దృష్టి పెట్టాలన్నారు. కొందరు లబ్ధిదారులు పెద్ద వయస్సు, శారీరక వైకల్యం కారణంగా షాపుకి రాలేకపోయే అవకాశం ఉందని.. వారికి హోం డెలివరీ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం  చేసేందుకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే సదుపాయం, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్లు వంటి సంస్కరణలను వేగవంతం చేయాలన్నారు మంత్రి పాశ్వాన్.

Posted in Uncategorized

Latest Updates