కేంద్రం కార్పొరేట్లకు  వేలకోట్లు  కట్టబెడుతోంది: రాహుల్

RAHULదేశంలో టాలెంట్ ఉన్న మధ్యతరగతి ప్రజలకు ప్రోత్సాహం లేదన్నారు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ. మల్టీనేషనల్ కంపెనీలైన కొకొ కోలా, ఫోర్డ్, హోండా కంపెనీలను మామూలు వ్యక్తులే ప్రారంభించారన్నారు. మనదేశంలో టాలెంట్ ఉన్నా.. ప్రభుత్వ ప్రోత్సాహం అందడం లేదని ఆరోపించారు. ఓబీసీల్లో ఎంతోమంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారన్న ఆయన.. వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఓబీసీ సదస్సులో ఆయన మాట్లాడారు.

దేశంలో ప్రభుత్వాన్ని  మోడీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ నడిపిస్తున్నారని ఆరోపించారు రాహుల్. బీజేపీలో ఉన్న ఇతర నేతల మాటలను కూడా..  వీరు పట్టించుకోరన్నారు. బీజేపీ ఎంపీలు.. కనీసం మోడీ ముందు నిలబడే ధైర్యం కూడా చేయలేకపోతున్నారన్నారు రాహుల్.

రాహుల్ గాంధీ కామెంట్స్ ను తప్పుపట్టారు బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి. RSS సేవాభావాన్ని పంచే సంస్థ అని.. అలాంటి వ్యవస్థకు నాయకుడైన వ్యక్తి పాలనను మార్గదర్శనం చేయడం దేశానికే మంచిదన్నారు.  మోడీ హాయంలోనే ఓబీసీ కమిషన్ ఏర్పాటు జరిగిందన్న అవగాహన లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారన్నారు.

సోమవారం(జూన్-11) ఉదయం ఓబీసీ సదస్సులో పాల్గొన్న రాహుల్..  సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

 

Posted in Uncategorized

Latest Updates