కేంద్రం కొత్త ప్రతిపాదన : గోదావరిలో చత్తీస్ ఘడ్ వాటాను కావేరీకి తరలించాలి

kendramదక్షిణ భారత నదుల అనుసంధానంపై కొత్త ఆలోచనను తెరపైకి తీసుకొచ్చింది కేంద్రం. గోదావరిలో వినియోగంలో లేని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర వాటా జలాలను కావేరికి తరలించాలని కేంద్రం ఆలోచిస్తుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (NWDA) సమావేశంలో దీనిపై ఆలోచనలు జరిపారు. ఛత్తీస్‌గఢ్‌కు గోదావరిలో 350 TMC ల వాటా ఉంది.  అయితే అందులో 250 TMC ల వరకు కావేరికి  తరలించడం ద్వారా  అనుసంధాన ప్రక్రియ విజయవంతం అవుతుందని కేంద్రం భావిస్తుంది. అయితే  ఈ ప్రతిపాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. గత నెలలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కృష్ణాలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడిందని, ప్రాజెక్టుల్లో నీటి కొరతను అధిగమించడానికి గోదావరిపైనే ఆధారపడే పరిస్థితి ఉందని తెలిపారు. అయితే ఈ కొత్త ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఛత్తీస్‌గఢ్‌ స్పందించే తీరును బట్టి ప్రతిపాదన అమల్లోకి వస్తుందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి.

Posted in Uncategorized

Latest Updates