కేంద్రం గెజిట్ : బీఈడీ అభ్యర్థులు SGTకి అర్హులే

BEDB.Ed చేసిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది కేంద్రం. ఇకనుంచి బీఎడ్ చేసిన వాళ్లు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హులేనని చెప్పింది. ఇందుకోసం 2010 నాటి గెజిట్ కు సవరణ చేస్తూ  జూన్ 29న  కొత్త గెజిట్ రిలీజ్ చేసింది.  డిగ్రీలో 50శాతం మార్కులుండి, NCTE గుర్తింపు పొందిన సంస్థ నుండి బీఎడ్ పూర్తి చేసినవాళ్లు.. ఎస్జీటీలుగా నియమితులైతే.. 2సంవత్సరాల లోపు 6నెలల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని గెజిట్ లో తెలిపింది కేంద్రం. ఎస్జీటీలుగా ఇప్పటివరకూ డీఎడ్ చేసిన వాళ్లకు మాత్రమే అర్హత ఉండేది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇపుడు బీఈడీలకు కూడా అవకాశం  కల్పించినట్లైంది.

Posted in Uncategorized

Latest Updates