కేంద్రం గ్రీన్ సిగ్నల్ : హైదరాబాద్ లో 136 వెహికల్ చార్జింగ్ స్టేషన్స్

charging

ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచటం.. దశల వారీగా పెట్రోల్, డీజిల్ కార్లను తొలగించటంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ పట్టాలెక్కుతోంది. ఇప్పటికే 10వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తో వివిధ దశాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టటంలో భాగంగా.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వెయ్యి చార్జింగ్ స్టేషన్లకు అనుమతులు ఇస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్ సిటీలో 136 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. అదే విధంగా టారిఫ్ లపైనా రాష్ట్రాల అభిప్రాయం కోరింది. ఎలక్ట్రిక్ వాహనాలపై రూపొందించిన డ్రాఫ్ట్ ను కూడా రాష్ట్రానికి పంపింది. వారం రోజుల్లో అభిప్రాయం చెప్పాలని కోరింది.

ఒక్కో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది ప్రాథమిక అంచనా వేసింది. ఎక్విప్ మెంట్ కోసమే రూ.15లక్షలు, ల్యాండ్, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ సిటీ పరిధిలో ప్రతి 3-4 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం. మొదటి విడతలో ఈ చార్జింగ్ స్టేషన్లను ప్రైవేట్ వ్యక్తులు కాకుండా.. డిస్కమ్ లే ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ తర్వాత ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకురావాలని కోరింది. 2020 అంటే మరో రెండేళ్లలో దేశవ్యాప్తంగా 50 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపైకి తెచ్చే విధంగా ఈ ప్రణాళిక ఉంది. 2030 నాటికి ప్రస్తుతం ఉన్న వాహనాల్లో 40శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండే విధంగా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసింది కేంద్రం. అందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో 136 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు..

Posted in Uncategorized

Latest Updates