కేంద్రం చాలా సీరియస్ : వాట్సాప్ పుకార్లకు చెక్ పెట్టండి

whatsappసోషల్ మీడియా యాప్ వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. వాట్సాప్‌ ద్వారా చక్కర్లు కొడుతున్న పుకార్లకు చెక్ పెట్టాలని కంపెనీకి కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ గట్టిగా సూచించింది. పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాల సంచారం పేరుతో వచ్చిన మెసేజ్ లతో దేశవ్యాప్తంగా ప్రజలు.. అమాయకులపై దాడులు చేయడంతో పాటు.. వారి మృతికి కారణమయ్యారు. ఈ క్రమంలో అలాంటి తప్పుడు మెసేజ్ లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి వ్యవస్థను సిద్ధం చేయాలని కేంద్రం ఆ సంస్థను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో హింసను రెచ్చగొట్టే విధంగా మెసేజ్ లు రాకుండా చూడాలని కోరింది. ఇలాంటి వదంతుల కారణంగా 10 రాష్ట్రాల్లో 31 మంది బలయ్యారని ఐటీ శాఖ ఆ హెచ్చరికల్లో తెలిపింది.

ప్రభుత్వ హెచ్చరికలకు స్పందించిన వాట్సాప్‌.. ఈ అంశంపై పరిశోధనకు అవార్డును ప్రకటించనున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొంటామని చెప్పింది. తప్పుడు వార్తలను అరికట్టేందుకు అవసరం అయిన టెక్నాలజీతోపాటు కంటెంట్ పరంగా అందించే ఐడియాకు బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించింది వాట్సాప్. చూద్దాం.. అది ఎంత మంది సక్సెస్ అవుతుందో….

Posted in Uncategorized

Latest Updates