కేంద్రం నిర్ణయం: ఏసీల క‌నిష్ట ఉష్ణోగ్ర‌త 24 డిగ్రీలే

Acఎయిర్‌ కండీషనర్‌ (AC) గతంలో కార్పోరేట్ కంపెనీల్లో మాత్రమే వీటిని ఉపయోగించేవాళ్లు. తర్వాత ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఏసీలను యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం వాటి వాడకం ఆఫీసుల్లోనే కాదు…సామాన్య ప్రజలు కూడా వాడుతున్నారు. దీనికి ఎంత తీవ్రతలు పెరగడంతో వాటి నుంచి తట్టుకోవడం కోసం వాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏసీ లేక పోతే ఉండలేని పరిస్థితికి వచ్చారు జనం. దీంతో విద్యుత్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఓజోన్‌ పొరను దెబ్బతీసే గ్రీన్‌హౌస్‌ వాయువులు భారీగా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌ చేయాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(BEE) ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విద్యుత్‌ ఆదాకు ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ సిఫార్సుల్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు.

ఎయిర్‌ కండీషనర్ల(ఏసీ)లో ఉష్ణోగ్రతను ఒక్క డిగ్రీ వరకుపెంచితే దాదాపు 6 శాతం విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. దీంతో అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. అలాగే మానవశరీరం సగటు ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. కానీ మల్టీనేషనల్ సంస్థలు, కంపెనీల్లో ఉష్ణోగ్రత 18-21 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇంత చల్లటి వాతావరణంలో దీర్ఘకాలం పనిచేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ క్రమంలో ఆరోగ్యంతో పాటు దుబారా ఖర్చును తగ్గించేందుకు ఏసీల్లో ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేలా సెట్టింగ్స్‌ను తప్పనిసరి చేయాలని BEE కేంద్రానికి సూచించింది.  దీంతో ఏటా 2,000 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం జపాన్‌ సహా పలుదేశాల్లో ఏసీల కనిష్ట ఉష్ణోగ్రతను 28 డిగ్రీలకు పరిమితం చేయడాన్ని BEE తన నివేదికలో తెలిపింది.

సమీప భవిష్యత్తులో ఏసీ ఉష్ణోగ్రత స్థాయిని 24 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడం కుదురకపోవచ్చు. ఏసీల్లో 24 డిగ్రీల సెల్సియస్‌ను తప్పనిసరి సెట్టింగ్‌గా మార్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates