కేంద్రం నిర్ణయం : యూజీసీ స్థానంలో ఉన్నత విద్యామండలి

ugc
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC)  స్థానంలో భారత ఉన్నత విద్యామండలి  (హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా -HECI) ఏర్పాటు చేయాలని భావిస్తోంది కేంద్రం. జులై 7న ముసాయిదా బిల్లును తయారు చేయనున్నట్లు తెలిపారు  ప్రధాని నరేంద్రమోడీ.  ఈలోగా విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు డ్రాఫ్ట్ బిల్లుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది HRD.

కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల విద్యార్థులకు తక్కువ ధరకే నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేస్తామన్నారు ప్రధాని. హైయర్ ఎడ్యూకేషన్ ఆప్ ఇండియా ఏర్పాటు వల్ల కొత్త విద్యాసంస్థలకు స్వతంత్రప్రతిపత్తి కలిగి విద్యాభివృద్ధి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మోడీ. కేంద్రం కూడా అందుకు అనుగుణంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు తెలిపారు ప్రధాని. ఇందుకోసం UGC చట్టం–1951ను రద్దు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న HECI కోసం ముసాయిదా బిల్లును రూపొందించామన్నారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా బిల్లు–2018ను ప్రవేశపెడతామన్నారు తెలిపారు ప్రధాని మోడీ.

 

Posted in Uncategorized

Latest Updates