కేంద్రం నెరవేర్చాలి…రాష్ట్రం చొరవ చూపాలి: జానా

telangana-congress-legislature-party-leader-k-jana-reddy_b_0308170740విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని.. దీనికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎల్పీ నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో జానారెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. విభజన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే తమ సహకారం ఉంటుందన్నారు జానా. అయితే ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవడంలేదో వాళ్లకే తెలియాలన్నారు. ప్రభుత్వానికి సమస్యలు చెప్పడమంటే గోడకు చెప్పినట్టేనని వ్యాఖ్యానించారు జానారెడ్డి. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మాట్లాడిన విధానం సరిగా లేదన్నారు. ఆ నాడు వాళ్ల పార్టీ విధానానికి… ఇప్పుడు మోడీ మాట్లాడిన విధానం పూర్తి భిన్నంగా ఉందని చెప్పారాయన.

Posted in Uncategorized

Latest Updates