కేంద్రం వైఖరికి నిరసన: వరంగల్ లో సింహగర్జన సభ

mandakrishnaదళిత, గిరిజనులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు MRPS నేత మందకృష్ణ మాదిగ. దళితులను దేశంలో బానిసలుగా చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తో పాటు వివిధ సమస్యలపై  వరంగల్ లో నిర్వహించనున్న సింహగర్జన సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితుల అత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందన్నారు మందకృష్ణ. ఎస్సీ,ఎస్టీలపై కేంద్రం వైఖరికి నిరసనగా సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎస్సీ వర్గీకరణను ఆపుతున్న కేంద్రానికి ఈ సభతో కళ్లు తెరిపిస్తామన్నారు. దళిత,గిరిజన సంఘాలు కలిసి ఏర్పాటు చేస్తున్న సభ కు బీజేపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామన్నారు.

సింహ గర్జన సభ ద్వారా కేంద్రానికి  హెచ్చరిక ఇవ్వనున్నట్లు చెప్పారు గిరిజన సంఘాల నేత బెల్లయ్యనాయక్. దళితులు,గిరిజనులు అంటే బీజేపీకి  చిన్న చూపు ఉందన్నారు. దలితులు,గిరిజనుల పై జరుగుతున్న దాడులను తిప్పికొడతామని చెప్పారు.

సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. హన్మకొండ మైదానంలో భారీ స్టేజీతో పాటు కళాకారుల కోసం ప్రత్యేక వేదికను సిద్దం చేస్తున్నారు. సభకు దాదాపు 30 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. సభకు వచ్చే వారికోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం, ఏడు కిలోమీటర్ల వరకు హైమాస్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates