కేంద్రం సంచలన తీర్పు: అడ్రస్ ప్రూఫ్ నుంచి పాస్ పోర్టు తొలగింపు

passportకేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్టు చివరి పేజీలో అడ్రస్ వివరాలను పొందుపరచకుండా…కేవలం బార్ కోడ్ లోనే అడ్రస్ ను ప్రింట్ చేయనున్నారు. అడ్రస్ ప్రూఫ్ ల లిస్టులోంచి పాస్ పోర్టులను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే బార్ కోడ్ విధానాన్ని అమలు చేయాల డిసైడ్ అయ్యింది. అది  విదేశీ వ్యవహారాల మంత్రి  శాఖకు , ఇమ్మిగ్రేషన్ అధికారులకు మాత్రమే కన్పిస్తుంది. ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న నంబరు సిరీస్ ముగిసిన వెంటనే కొత్త విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. పునరుద్ధరించుకునే, కొత్త పాస్ పోర్టులకు మాత్రమే కొత్త విధానం వర్తిస్తుంది. చెల్లుబాటు కాలం ఉన్న వాటిని మార్చుకోవాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం పాస్ పోర్టు బుక్ చివరి పాస్ పోర్టు దారుడి పూర్తి అడ్రస్, తల్లిదండ్రుల పేర్లు…ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతుందనే వివరాలు ఉంటాయి. ఇకపై నుంచి ఆ పేజీలో చిరునామా స్థానంలో బార్ కోడ్ ఉండనుంది. ఆ కోడ్ ను ఎయిర్ పోర్టుల్లో స్కాన్ చేసిన వెంటనే పాస్ పోర్టుదారుడికి అడ్రస్ తో పాటు గత వివరాలన్ని అధికారులకు కన్పిస్తాయి. పాస్ పోర్టుఉన్న వారికి భద్రత కోసమే ఇలాంటి విధానం అమల్లోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది.  పాస్ పోర్టు జర్నీకి గుర్తింపులాంటిదేనని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates