కేంద్రం హామీ : ఖమ్మం, మహబూబ్ నగర్ లో క్లస్టర్లు

ఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతో భేటీ అయ్యారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో చేనేత సమస్యలపై ఆమెతో  చర్చించారు. హ్యాండ్లూమ్, పవర్ లూమ్ రంగాల్లో అమలు చేస్తున్న చర్యలను వివరించారు. కేంద్రమంత్రితో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు కేటీఆర్.

చేనేత కార్మికుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. అదే విధంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి కొత్తగా 10 క్లస్టర్లు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరామని చెప్పారు. ఈ క్లస్టర్లతో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. మరమగ్గాల ఆధునికీకరణకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. 8 వేల మరమగ్గాల ఆధునీకరణకు కేంద్ర నిధులు కోరామని తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని…. రాష్ట్రానికి నిధుల విడుదలలో ఆలస్యం లేకుండా చూస్తామని కేంద్రమంత్రి చెప్పారని అన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates