కేంద్రమంత్రి గడ్కరీకి హరీశ్ లేఖ

HARISH LETTERకేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీశ్ రావు సోమవారం (ఏప్రిల్-2) లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ ఎక్కువ కృష్ణా జలాలు వినియోగిస్తున్నదని మంత్రి లేఖలో చెప్పారు. వినియోగించుకున్న నీటి వివరాలను కూడా ఏపీ తెలపడం లేదని మంత్రి ఫిర్యాదు చేశారు. నీటి విడుదల అంశంపై దృష్టి సారించేలా సీనియర్ అధికారులతో పర్యవేక్షించాలని హరీశ్ రావు తెలిపారు. వివరాలు తారుమారు చేసేందుకు వీలు లేకుండా టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లేఖలో కోరారు మంత్రి హరీశ్.

Posted in Uncategorized

Latest Updates