కేంద్రాన్ని నిలదీసిన టీఆర్ఎస్ : తెలంగాణ గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా

తెలంగాణలోని విద్యుత్ ప్లాంట్ ను లాగేసుకున్నారన్నారు TRS ఎంపీ వినోద్. కేంద్రంపై TDP ప్రవేశపెట్టిన తీర్మాణం సందర్భంగా శుక్రవారం (జూలై-20) పార్లమెంట్ సమావేశంలో మాట్లాడారు వినోద్. విద్యుత్ ప్లాంట్ ను లాగేసుకోవడంతో ఛత్తీస్ గడ్ నెంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని..ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు. మోడీ సర్కార్ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరన్న వినోద్..కేంద్ర ప్రభుత్వ పనితీరుపైనే అవిశ్వాసమన్నారు.

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీరు ప్రాజెక్టులకు కాంగ్రెస్ అడ్డుగా మారుతోందని, అనవసరంగా కేసులు వేస్తోందన్నారు.  తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ రావాల్సిందిగా చట్టంలో ఉన్నప్పటికీ..ఇప్పటికీ ఆ దిశగా చర్చ జరగలేదన్నారు. తెలంగాణ గురించి కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదన్న వినోద్.. హైకోర్టు విభజన ఇప్పటికీ జరగకపోవడమే నిదర్శనం అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి చట్టంలో క్లీయర్ గా ఉన్నప్పటికీ ..మోడీ ఆ ప్రస్తావనే తీయకపోవడం దారుణం అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను మోడీ ఇప్పటివరకూ నెరవేర్చలేకపోయారన్నారు.  తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు వినోద్.

మోడీ ప్రభుత్వం అన్యాయంగా  ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌ లో విలీనం చేసిందని.. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పాడన్నారు. ప్రధాని మోడీ స్వయంగా చొరవ తీసుకుని.. ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపారని తెలిపారు. ఏపీలో విలీనం చేసిన  .. ఈ ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు సభలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు ఎంపీ వినోద్.

 

Posted in Uncategorized

Latest Updates