కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు

modiప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. అనంతపూర్ జిల్లా.. జంతలూరులో ఏపీ సెంట్రల్ యూనివర్సిటీని పెట్టాలని నిర్ణయించారు. ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ కోసం.. 450 కోట్లను మంజూరు చేశారు. విభజన చట్టం హామీలో భాగంగా కొత్త యూనివర్సిటీ కేటాయించామని చెప్పింది కేంద్రం.

ఢిల్లీ మెట్రో కారిడార్ ను పొడగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడంలో భాగంగా.. నోయిడా సిటీ సెంటర్ నుంచి.. 62వ సెక్టార్ వరకు 6.67 కిలోమీటర్ల మేర ఢిల్లీ మెట్రో రైలు మార్గాన్ని  పొడగించనున్నారు.  భోపాల్ లో నేషనల్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ సంస్థను ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.

జార్ఖండ్ లోని డియోఘర్ లో ఎయిమ్స్ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద ఈ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం.. 11వందల 3 కోట్ల రూపాయలను మంజూరుచేశారు.

ఇండియా – బ్రూనై దేశాల మధ్య పన్నుల విషయంలో పరస్పర సహకారం, సమాచార మార్పిడి చేసుకోవాలన్న ఒప్పందంపై సంతకం చేయాలని నిర్ణయించింది. ఈ సమాచారాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు. అత్యంత ముఖ్యమైన సందర్భాల్లో.. కోర్టులు, అధికారులకు మాత్రమే ఈ సమాచారం తెలియజేస్తారని కేంద్రం తెలిపింది. మైనింగ్, జియాలజీ రంగాల్లో మొరాకో దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.

Posted in Uncategorized

Latest Updates