కేంద్ర నిర్ణయం: ప్రభుత్వ ఉద్యోగులకు ఓవర్ టైం అలవెన్సులు కట్

bioకేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఉద్యోగులపై ఇచ్చే ఓవర్‌ టైం అలవెన్సును ఇకపై నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి పర్సనల్ మినిస్ట్రీ  ఒక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కార్యనిర్వాహక సిబ్బంది మినహా ఉద్యోగులకు ఓవర్ టైం అలవెన్సును రద్దు చేసింది. అన్ని మంత్రివర్గ విభాగాలతో పాటు భారత ప్రభుత్వ అటాచ్డ్, సబార్డినేట్ కార్యాలయాలలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అత్యవసరమైన సమయంలో సీనియర్ అధికారి సంబంధిత ఉద్యోగులను నిర్దేశించినప్పుడు మాత్రమే ఓటీఏ చెల్లించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అలాగే బయోమెట్రిక్ హాజరు ప్రకారం ఓవర్ టైం అలవెన్స్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఓవర్ టైం అలవెన్స్…ఓటి రేటును సవరించేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 లో జారీ చేసిన ఆర్డర్ ప్రకారమే ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది.

Posted in Uncategorized

Latest Updates