కేంద్ర పదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన ఘనత కేసీఆర్‌ ది : హరీష్

కేంద్ర పదవులను గడ్డిపోచలా త్యాగం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ ది అన్నారు మంత్రి హరీష్. ఆదివారం (అక్టోబర్-14)న తెలంగాణ భవన్‌ లో హరీష్ సమక్షంలో బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో పాటు పలువురు నేతలు TRSలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ .. కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. జాతీయ పార్టీలు అవకాశవాద పార్టీలు. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంలో BJPది కీలక పాత్ర అన్నారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో బీజేపీ ఏం చేసిందో చెప్పాలని.. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌ లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర బీజేపీదని.. బీజేపీ జాతీయ నేతలు మమ్మల్ని విమర్శిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

 

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానన్న రాహుల్ గాంధీ.. తెలంగాణకు ఏమిస్తారో స్పష్టం చేయాలన్నారు. తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ పరిశ్రమలకు రాయితీలు ఇస్తారో లేదో స్పష్టం చేసి రావాలన్నారు. కాంగ్రెస్-టీడీపీ పొత్తు తెలంగాణ పాలిట గుదిబండ అని.. మహా కూటమిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు హరీష్.

 

 

Posted in Uncategorized

Latest Updates