కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే: LTC కింద విదేశాలకు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఓ బంపర్ ఆఫర్. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(LTC) కింద ఇక నుంచి విదేశాలకు కూడా వెళ్లే అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ ఏడాది మార్చిలోనూ LTC కింద విదేశీ టూర్లు ఉంటాయని, సార్క్ దేశాలకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే LTC లో భాగంగా ఉద్యోగులు వెళ్లేందుకు ఐదు మధ్య ఆసియా దేశాల పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో కజక్‌స్థాన్, తుర్కమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ ఉన్నాయి.

LTC కింద అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతోపాటు టికెట్ రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48.41 లక్షల మంది కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates