కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రం అమలు చేయడంలేదు: మోడీ

ఒడిశాలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ పథకం ఎందుకు అమలు చేయడంలేదని సీఎం నవీన్ పట్నాయక్ ను ఒడిశా ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఖుర్దాలో జరిగిన బహిరంగసభలో మోడీ మాట్లాడారు. ఎన్నికల ప్రచార సభ తరహాలోనే ఆ సభ నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ ను అమలు చేస్తే… దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రజలు పొందుతున్న వైద్య సేవలను ఒడిశా ప్రజలు కూడా పొందుతారన్నారు. స్వచ్ఛ్ భారత్ ను కూడా ఒడిశా పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు.

అంతకుముందు IIT భువనేశ్వర్ పర్మినెంట్ క్యాంపస్ ను జాతికి అంకితం చేశారు మోడీ. ఒడిశాలో14వేల 500 కోట్ల విలువైన పనులకు శంకస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తూర్పు భారతాన్ని ఆగ్నేయాసియాకు గేట్ వేగా మారుస్తామన్నారు. తూర్పు భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు.

రేపు(మంగళవారం) అస్సాంలో పర్యటించనున్నారు మోడీ. అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ లను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన… బోగిబీల్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates