కేంద్ర మంత్రి అక్బర్‌పై కదం తొక్కిన మహిళా జర్నలిస్టులు  

ఢిల్లీ : ‘మీటూ’ ఉద్యమంతో పీకల్లోతు లైంగిక వేధింపుల ఆరోపణల్లో కూరుకుపోయిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై ఆగ్రహంతో కదం తొక్కారు మహిళా జర్నలిస్టులు. జర్నలిస్టు ప్రియారమణిపై అక్బర్‌ పరువునష్టం దావా వేసిన సందర్భంగా 20మంది మహిళా జర్నలిస్టులు తామంతా ఆమెకు మద్దతిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తమ వాదనలనూ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరుతూ ఓ లేఖను సిద్ధం చేశారు. వీరంతా ఏషియన్‌ ఏజ్‌, దాని మాతృసంస్థ డెక్కన్‌ క్రానికల్‌ (డీసీ)లతో అనుబంధం ఉన్నవారే. ‘మేం బాధితులం కాకపోయినా.. అక్బర్‌ చర్యలకు సాక్షులుగా ఉన్నాం’ అని ఓ లేఖను సిద్ధం చేశారు ఆ మహిళా జర్నలిస్టులు.

Posted in Uncategorized

Latest Updates