కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. మాటలతో మభ్యపెడుతున్నాయి : పవన్

11brk-pawan114aకేంద్ర..ఏపీ ప్రభుత్వాలు మాటలతో మభ్యపెడుతు్నాయన్నారు జనసేన అధినేత పవన్. ఆదివారం (ఫిబ్రవరి-11)  ప్రశాసన్‌నగర్‌లోని జనసేన కార్యాలయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సమావేశం అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు.

జేపీ, ఉండవల్లిల ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మిత్రపక్షంగా బీజేపీ, టీడీపీలు తనను గౌరవిస్తారనుకుంటున్నానని.. ఆ లోగా నివేదికలు ఇస్తారని భావిస్తున్నా అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే.. అప్పుడేం చేయాలో నిర్ణయించి ముందుకెళతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిబ్రవరి 15 వరకు డెడ్‌లైన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తేదీలోగా తనకు నివేదికలు ఇవ్వాలని కోరారు.

జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో తాను ఉండటంలేదన్నారు. కమిటీలో నిపుణులు నివేదిక ఆధారంగా రిపోర్ట్ ఇస్తారని చెప్పారు. టీడీపీ,  బీజేపీ కలయిక వల్ల ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందని భావించినట్లు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. అంతకుముందు జరిగిన అవకతవకలేమైనా ఉంటే ప్రధానిగా మోడీ.. సీఎంగా చంద్రబాబు ఉంటే చాలా మేలు జరుగుతుందని భావించి, 2014లో మద్దతు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు పవన్.

Posted in Uncategorized

Latest Updates