కేంద్ర సంస్థల సెక్యూరిటీ కావాలి: రేవంత్

హైదరాబాద్ : సెక్రటేరియట్ లో ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి కార్యాలయానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన సెక్యూరిటీ పెంచాలంటూ వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై తనకు నమ్మకం లేదని… కేంద్ర సంస్థలకు చెందిన సెక్యూరిటీతో భద్రత కల్పించాలని కోరారాయన. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి … నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ సభల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఆయనపై నాకు నమ్మకం లేదు అని అన్నారు. నిండు సభలోనే ఆపరేషన్ బ్లూ స్టార్ స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారని గుర్తుచేశారు.

ఇటీవల కాలంలో.. మంత్రి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తనను అంతమొందిస్తామని అన్నారని… కాబట్టి కేంద్ర సెక్యూరిటీ సంస్థల నుంచి తనకు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్ రెడ్డి .. ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఎల్బీనగర్ లో పోటి చేస్తే… 10కోట్ల రూపాయలు ఇస్తామని బహిరంగంగా చెప్పిన విషయంపైన కూడా ఈసీకి కంప్లయింట్ చేశానన్నారు రేవంత్ రెడ్డి. ఇది లంచం ఇవ్వచూపిన దాని కిందకి  వస్తుందని.. సుమోటోగా తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. తన ఫిర్యాదుపై అయినా కేసు నమోదు చేయాలని అడిగానన్నారు. ఒక అభ్యర్థికి 10కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి… ఒక అభ్యర్థికి 28 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలనేది రూల్ కదా అన్నారు రేవంత్ రెడ్డి.

 

 

Posted in Uncategorized

Latest Updates