కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో 54వేల ఉద్యోగాలు

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌(ఎస్ఎస్‌సీ). కానిస్టేబుల్‌ (జీడీ), రైఫిల్‌మెన్‌ (జీడీ) విభాగాల కింద మొత్తం 54,953 ఖాళీలు ఉన్నాయి. వీటిలో పురుషులకు 47,307, మహిళలకు 7,646 పోస్టులను కేటాయించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్ )లో 21,566 పోస్టులతో పాటు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్ఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ), అసోం రైఫిల్స్‌(ఏఆర్‌), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ల్లో ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాసై, 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఆగస్టు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని  సూచించింది ఎస్‌ఎస్‌సీ.

 

Posted in Uncategorized

Latest Updates