కేజ్రీవాల్ ఇంటికెళ్లిన బాబు, మమతా, కుమారస్వామి, పిన్నరయి

KERఢిల్లీ లొల్లికి ఎండ్ కార్డ్ పడటం లేదు. లెఫ్టినెంట్ గవర్నర్, IAS అధికారుల తీరుకు నిరసనగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో దీక్ష కొనసాగిస్తోంది కేజ్రీవాల్ అండ్ టీం. ఆరో రోజుకు చేరుకున్న దీక్షపై విమర్శలు వస్తున్నా.. ఢిల్లీ ప్రజల కోసమే తాము ఇదంతా చేస్తున్నామంటున్నారు కేజ్రీవాల్. గవర్నర్ నివాసం నుంచే ట్విట్టర్ లో రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు కేజ్రీవాల్. ఐఏఎస్ అధికారుల సమ్మెతో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినట్టుగానే ఉందన్నారు.

అయితే.. దీక్షపై ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా విమర్శలు చేశారు. ఇన్ని రోజులుగా ఆహారం, నీరు తీసుకోకుండా ఉన్నప్పటికీ.. మంత్రి సత్యేంధ్రజైన్ కిలోన్నర బరువు ఎలా పెరిగారని ప్రశ్నించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో వారు ఏ నీరు తాగుతున్నారో.. అది ప్రజలకు కూడా సప్లై చేయాలన్నారు. తన బరువు పెరిగిందని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు సత్యేంధ్రజైన్. నాలుగు రోజుల్లో మూడున్నర కిలోలకు పైగా బరువు తగ్గానని ట్వీట్ చేశారు. రక్తంలో షుగర్ లెవర్స్ పడిపోయాయని.. తన హాస్పిటల్ రిపోర్ట్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాలుగు నెలులుగా సమ్మె చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని IAS అధికారుల సంఘం తప్పుపట్టింది. అధికారులంతా విధులకు హాజరవుతున్నారని.. లంచ్ టైంలో మాత్రం ఐదు నిమిషాలు మౌన ప్రదర్శన చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. కేజ్రీవాల్ ను కలిసేందుకు వెళ్లాలని మమతాబెనర్జీ,చంద్రబాబు, కుమారస్వామి, పిన్నరయి విజయన్ అనుకున్నా.. రాజ్ భవన్ అధికారులు పర్మీషన్ ఇవ్వలేదు. దీంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసానికి చేరుకొని వారు కుటుంభసభ్యులను పరామర్శించారు. అయితే గౌరవనీయ లెఫ్టినెంట్ గవర్నర్ స్వతహాగా ఇంతపెద్ద నిర్ణయం తీసుకొని ఉండరని, PMO డైరక్ట్ చేయడంతోనే తనని కలిసేందుకు  మమతా, బాబు, పిన్నరయి, కుమారస్వామిలకు పర్మీషన్ ఇవ్వలేదన్నారు కేజ్రీవాల్.

Posted in Uncategorized

Latest Updates