కేజ్రీవాల్ కు మద్దతుగా…. ఢిల్లీలో ఆప్ కార్యకర్తల ఆందోళన ర్యాలీ

kejrwalఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ఆదివారం(జూన్-17) సాయంత్రం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నివాసం వైపుగా ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఢిల్లీలోని మండి హౌస్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది.ఈ ర్యాలీలో సీపీఎం కూడా పాల్గొంది. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారులు చేస్తున్న స్ట్రైక్ ను విరమింపచేయాలంటూ వారం రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ నివాసంలో ముగ్గురు ఆప్ మంత్రులతో కలసి కేజ్రీవాల్ ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఆప్ ర్యాలీకి ఎటువంటి పర్మీషన్ లేదని పోలీసులు తెలిపారు. కొన్ని ఏరియాల్లో పోలీసులు నిషేదాజ్ణలు విధించారు. కేజ్రీవాల్ నిరసనకు చంద్రబాబు, మమతా బెనర్జీ, కుమారస్వామి, పిన్నరయి విజయన్ లు మద్దతు తెలిపారు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కేజ్రీవాల్ కు తన మద్దతు తెలిపారు.అయితే స్ట్రైక్ చేస్తున్నారని కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండించారు ఢిల్లీ ఐఏఎస్ అధికారులు. ఏ ఒక్క ఐఏఎస్ అధికారి కూడా స్ట్రైక్ లో పాల్గొనటం లేదన్నారు. అధేవిధంగా తాము సెలవురోజుల్లో కూడా పనిచేస్తున్నామని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates