కేజ్ కల్చర్: సక్సెస్ ఫుల్ గా చేపల సాగు

మహబూబ్ నగర్ జిల్లాలో కేజ్ కల్చర్ చేపల సాగు సక్సెస్ ఫుల్ గా సాగవుతోంది. గతేడాది ఒక యూనిట్ తో ప్రారంభించిన చేపల ఉత్పత్తి.. ఈ ఏడాది 11 యూనిట్లకు విస్తరించింది . కోయిల్ సాగర్, సంగం బండ, భూత్పూర్ రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ లో చేపల సాగుకు ఏర్పాటు చేశారు. సంగంబండలోని 6 యూనిట్లలో 6లక్షల 60వేల చేప పిల్లలను కేజ్ లో వదిలారు. ప్రస్తుతం ఒక్క యూనిట్ లో 30 టన్నుల వరకు చేపల బరువు పెరిగింది.

కేజ్ కల్చర్ లో చేపలు పెంచడంతో మంచి లాభాలు వస్తున్నాయంటున్నారు మత్స్యకారులు. గతంలో  జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఏపీలో పర్యటించి… వీటి పెంపకం గురించి తెలుసుకున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీతో… చేపల పెంపకం చేస్తూ.. కుటుంబ పోషణ చేసుకుంటున్నామన్నారు.

మత్స్య సహకార సంఘాల ఆధ్వర్యంలో  కేజ్ కల్చర్ ను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు చేపల పెంపకం దారులు. రిజర్వాయర్ మధ్యలో దీన్ని ఏర్పాటు చేసి.. గాలివాన, దుమారం తట్టుకునేలా చేపలను గట్టి వలలో వేసి పెంచుతున్నామంటున్నారు. కేజ్ లో వేసిన చేపలు 90శాతం వరకు చేతికొస్తున్నాయంటున్నారు. కేజ్ కల్చర్ తో మంచి లాభాలు వస్తుండటంతో..  సంగంబండ రిజర్వాయర్ లో వీటి సంఖ్యను 10 యూనిట్లకు పెంచాలని చూస్తున్నారు.

ప్రభుత్వ సాయంతో మళ్లీ కుల వృత్తి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మత్స్యకారులు. ఫ్రీగా చేపలు ఇవ్వడంతో పాటు సబ్సిడీతో వాటికి కావాల్సిన ఫీడ్ ఇవ్వడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates