కేటాయింపులపై కొర్రీ : కర్నాటకలో 22 మంది మంత్రులు

kumarannaకర్ణాటకలో కేబినెట్ విస్తరించారు ముఖ్యమంత్రి కుమారస్వామి. కొత్త మంత్రులతో రాజ్ భవన్ లో గవర్నర్ వాజుభాయి వాలా ప్రమాణం చేయించారు. మొత్తం 22మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు గవర్నర్. కాంగ్రెస్ నుంచి 15మంది, JDS నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. JDS నుంచి రేవన్న, GT దేవేగౌడ, బండప్ప కాశెంపూర్, పుట్టరాజు, వెంకట్రావు, HK కుమారస్వామి, మహేష్, N మహేష్, కాంగ్రెస్ నుంచి DKశివకుమార్, RVదేశ్ పాండే, KJ జార్జ్, శివశంకర రెడ్డి, క్రిష్ట బౌరెగౌడలు ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. అయితే ఎవరెవరికీ ఏయే శాఖలు కేటాయింపులు జరిగాయన్నదానిపై ఇంకా సృష్టత రాలేదు. హోంశాఖను డిప్యూటీ సీఎం పరమేశ్వర్ కు కేటాయించే అవకాశముందని తెలుస్తుంది. ఇక కీలకమైన ఆర్ధికశాఖను కుమారస్వామి తమ్ముడు హెచ్.డి రేవన్న చేపట్టే అవకాశమున్నట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ ట్రబుల్ ఘూటర్ డీకే శివకుమార్ కు ఇరిగేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ రెండు శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తుంది.

Posted in Uncategorized

Latest Updates