కేటాయింపులు ఇలా : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు

143-3-696x392సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న సర్పంచుల గడుపు జూలై నెలాఖరుతో ముగుస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగనుంది. ఈ క్రమంలోనే రిజర్వేషన్లను విడుదల చేసింది ఎన్నికల సంఘం.  పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

రాష్ట్రం యూనిట్‌ గా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. SC, STలకు 2011 జనాభా ప్రాతిపదికన, BCలకు ఇప్పుడున్న ఓటరు గణన ప్రాతిపదికన సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను నిర్ధారించనున్నారు. రిజర్వేషన్లలో ప్రాంతాలవారీగా ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని కులాలను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్లను కూటాయించింది ప్రభుత్వం.  మండలంలో పంచాయతీలు, ఆ పంచాయతీల్లో జనాభా ప్రకారం వార్డుల రిజర్వేషన్లు చేయాలని సూచించారు. మండలంలో పంచాయతీల వివరాలు కలెక్టర్లకు ఎంపీడీవోలు పంపించాలని, జిల్లాలో రిజర్వేషన్లు కేటాయించే వివరాలను పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదిస్తే.. రాష్ట్రం యూనిట్‌గా సర్పంచ్ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మండలస్థాయిలో ఎంపీడీవోలు వార్డు స్థానాల రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే ఆర్డీవోలు ఆమోదిస్తారు.

STలకు భారీగా పదవులు

రాష్ట్రంలో 12 వేల751 గ్రామ పంచాయతీలున్నాయి. అన్ని పంచాయతీల్లో జనాభా వీటిలో ఏజెన్సీ గ్రామాలు 1వెయ్యి 308 ఉండగా, 18 లక్షల68 వేల968 మంది STలు ఉన్నారు. 100 శాతం STలు ఉన్న గ్రామాలు 1వెయ్యి326 ఉండగా, ఈ గ్రామాల్లో 9లక్షల 07 వేల 700 మంది జనాభా ఉన్నారు. 1వెయ్యి308 గ్రామాలు పూర్తిగా STలకే రిజర్వ్‌ చేశారు. 100 శాతం STలున్న 1 వెయ్యి326 గ్రామాల్లోనూ STలే సర్పంచ్‌ లు (మొత్తం 2వేల634) కానున్నారు. మిగిలిన మైదాన పంచాయతీలు 10 వేల117 ఉన్నాయి. వీటిలో SC, STలు కాకుండా ఇతర వర్గాల జనాభా 1 కోటీ75 లక్షల16 వేల 422 ఉన్నది. ఇక్కడ జనాభా ఆధారంగా ST లకు 5.73 శాతం రిజర్వేషన్, 35లక్షల 84వేల772 మంది SC జనాభా ఆధారంగా 20.46 శాతం SC లకు రిజర్వ్‌చేశారు. ఇవి మినహాయించి BC ఓటర్ల లిస్ట్ ప్రకారం 34 శాతం BCలకు కేటాయించారు. మైదాన గ్రామాల్లో జనాభా లెక్కల ప్రకారం ST లకు 5.73 శాతం రిజర్వేషన్‌తో 580 పంచాయతీలు వారికి సొంతం కానున్నాయి. 20.46 శాతం SC లకు 2 వేల 070 పంచాయతీలు, 34 శాతం ఓటర్లతో BCలకు 3 వేల440 గ్రామాలు రిజర్వ్ అవుతున్నాయి. జనరల్ క్యాటగిరీలో 4 వేల 027 పంచాయతీ ఉన్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త గ్రామాల ఏర్పాటుతో SC,STలకు భారీగా రిజర్వేషన్లు కలిసివచ్చాయి.

50 శాతం మహిళలకు 

అన్ని క్యాటగిరీల్లోనూ 50 శాతం మహిళలకు స్థానాలు కేటాయించనున్నారు. మండలం యూనిట్‌గా మహిళలకు వార్డులు కేటాయించనున్నారు. కేటాయించే అంశంలో ఎస్టీలకు రిజర్వు చేసిన స్థానాల నుంచి, ఎస్సీ, బీసీ, జనరల్ స్థానాల నుంచి 50 శాతం లెక్కన రిజర్వేషన్ చేయనున్నారు. వార్డులు, పంచాయతీల కేటాయింపులో లాటరీ పద్ధతిని పాటిస్తారు.

కేటాయింపులు ఇలా..

ఒక గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల ఖరారు ఇలా ఉండనున్నది. 2 వేల900 మంది జనాభాతో 10 వార్డులున్న పంచాయతీలో 260 మంది ST జనాభా ఉంటే వారికి 8.69 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఈ లెక్కన ఒక వార్డు STలకు, రెండు వార్డులు SCలకు, మూడు వార్డులు BCలకు, నాలుగు వార్డులు జనరల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇదే తరహాలో మండలంలో పంచాయతీలకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates