కేటీఆర్ అంటే కొండంత అభిమానం : విజయవాడ నుంచి హైదరాబాద్ కు నడిచి వచ్చాడు

హైదరాబాద్ : మానవత్వంతో సేవా పనులు చేస్తూ..సోషల్ మీడియాలో అన్నా అంటే చాలు నేనున్నా అనే భరోసానిచ్చే నాయకుడు మంత్రి కేటీఆర్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇదిలావుంటే ఆంధ్రా నుంచి ఓ అభిమాని కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటేందుకు పాదయాత్ర చేపట్టాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు నడకదారిన ఇవాళ హైదరాబాద్ కు చేరాడు.

ఈ సందర్భంగా కేటీఆర్ గురించి మాట్లాడాడు ఏపీకి చెందిన రోహిత్. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో వాటి పరిష్కారానికి కృషిచేస్తూ దూసుకెళ్తున్న కేటీఆర్ విధానం, యువతరానికి స్ఫూర్తినిస్తోందన్నాడు. ఈ విధానంతో ముందుకు సాగుతున్న తీరుతోనే తాను కేటీఆర్‌ కు అభిమానిగా మారినట్లు చెప్పాడు రోహిత్ కుమార్‌ రెడ్డి. TRS పార్టీ విజయం కోరుతూ.. రోహిత్  17 రోజులుగా పాదయాత్ర చేస్తూ విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమాన రాజకీయ నాయకుడు మంత్రి కేటీఆర్‌ను కలిశాడు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఆసక్తిని, అభిమానాన్ని పెంపొందించాయని తెలిపాడు రోహిత్. కేటీఆర్ పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవడానికి కేటీఆర్ ఫొటోను తన గుండెల మీద టాటూగా వేయించుకున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా రోహిత్ ను అభినందించిన మంత్రి కేటీఆర్.. యువకుడిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

Posted in Uncategorized

Latest Updates