కేటీఆర్ ఆదేశం : బర్త్ డేకి హోర్డింగ్స్, ఫ్లెక్సీలు పెట్టొద్దు

కార్యకర్తలు, అభిమానులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. 24వ తేదీ నా బర్త్ డే.. ఆ రోజును పురస్కరించుకుని పేపర్ యాడ్స్, ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయొద్దని కోరారు. ఇప్పటికే ఎవడైనా ఏర్పాటు చేసి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. పార్టీ ఆఫీస్ కు కూడా సమాచారం ఇచ్చారు. తన పుట్టిన రోజున వీటి కోసం చేసే ఖర్చును.. సీఎం సహాయ నిధికి ఇవ్వాలని సూచించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నట్లు అవుతుందన్నారు మంత్రి కేటీఆర్. అదే విధంగా బొకేలు కూడా ఇవ్వొద్దని కోరారు. కేకులు కట్ చేయొద్దని కూడా కార్యకర్తలు, అభిమానులను కోరారు. 24వ తేదీ అభిమానులు అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

మీ పుట్టిన రోజున అందరికీ ఎందుకు ఆదర్శంగా ఉండకూడదు.. ఆ రోజు మీ పేరుతో చేసే ఖర్చును మంచి పనుల కోసం ఉపయోగించాలని కోరవచ్చు కదా అంటూ ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ పై విధంగా స్పందించారు.

Posted in Uncategorized

Latest Updates