కేటీఆర్, కవిత రియాక్షన్ : సీఎం క్షేమం.. ఆల్ ఈజ్ వెల్

KTRPAGE4సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో ప్రమాదం తప్పింది. మంగళవారం (ఫిబ్రవరి-27) కరీంనగర్ లో సీఎం బయలుదేరే సమయానికి హెలికాప్టర్ లోపలున్న వైర్ లెస్ సెట్ లో హఠాత్తుగా పొగలు వచ్చాయి. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ బ్యాగును దూరంగా తీసుకెళ్లి పడేశారు. సీఎం కేసీఆర్ కు తప్పిన ప్రమాదంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆల్ ఈజ్ వెల్ అంటూ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ బయలుదేరి వెళ్లారని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంపై ఎంపీ కవిత ట్విట్ చేశారు. ఆల్ ఈజ్ వెల్ అని ట్విట్ చేశారు.

కేసీఆర్ కరీంనగర్ నుంచి పెద్దపల్లి పర్యటనకు బయలుదేరేందుకు హెలికాఫ్టర్ ఎక్కిన తర్వాత ఓ బ్యాగ్‌లో నుంచి అకస్మాత్తుగా పొగలు రావడాన్ని సీఎంవో అధికారి గుర్తించారు. వెంటనే ఆ అధికారి హెలికాఫ్టర్ నుంచి బ్యాగ్‌ను బయటకు తీసుకుని పరిగెత్తారు. అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్ ఆ బ్యాగ్‌ను వంద మీటర్ల దూరం తీసుకొచ్చి పడేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates