కేటీఆర్ కు అరుదైన గౌరవం…బ్లూమ్ బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆహ్వానం

రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. బ్లూమ్ బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ప్రపంచంలో మారుతున్న ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై చర్చించేందుకు కొత్తగా ఏర్పాటైన న్యూ ఎకానమీ ఫోరం ప్రారంభించడానికి వ్యవస్థాపక ప్రతినిధిగా కేటీఆర్‌ ను ఆహ్వానించారు. ఆహ్వానం పై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
నవంబర్- 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు సింగపూర్ లో పై బ్లూమ్ బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం సమావేశాలు జరుగనున్నాయి. వివిధదేశాల నుంచి సుమారు 300 కంపెనీల సీఈవోలు, రాజకీయ నాయకులు, వక్తలు హాజరవుతారు. నగరీకరణ, పట్టణ మౌలిక వసతుల కల్పన, ఐటీ రంగాల అంశాలపై ఫోరంలో చర్చించాలని కేటీఆర్‌ ను కోరారు.

Posted in Uncategorized

Latest Updates