కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

 ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం లభించింది. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ జరుగనున్నది. ఈ సదస్సులో ప్రపంచదేశాల నుంచి ప్రముఖులు పాల్గొంటున్నారు. సదస్సులో ప్రసంగించాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జీ బ్రౌన్ స్వయంగా కేటీఆర్‌ కు లేఖ రాశారు. ఈ సదస్సులో ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ అనే అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణపరంగా వేగంగా వస్తున్న మార్పులు, గ్లోబల్ వార్మింగ్ క్రమంలో ఈ సదస్సు ఉపయోగకరంగా ఉంటుందని లేఖలో రాశారు బ్రౌన్.  వాతావరణ సమతుల్యతను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాలను గురించి సదస్సులో వివరించాలని కేటీఆర్ ను కోరారు గవర్నర్ బ్రౌన్. ఈ సదస్సులో ప్రభుత్వాలలో కీలకమైన వ్యక్తులతోపాటు వాతావరణంపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నవారిలో ప్రముఖులు పాల్గొంటారని ఆయన ఆ లేఖలో కేటీఆర్ కు వివరించారు.

Posted in Uncategorized

Latest Updates