కేటీఆర్ గ్రీన్ ఛాలెంజ్ : మొక్కలు నాటిన మహేష్

తెలంగాణ హరితహారంలో భాగంగా చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.  పచ్చదనంతోనే నిండుదనం అంటూ ప్రముఖులు మొక్కలు నాటుతూ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, భార‌త మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్క‌ర్‌, టాలీవుడ్ హీరో మహేష్ బాబు, హైదరాబాద్‌ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ ఛాలెంజ్‌ చేసిన విష‌యం తెలిసిందే.  మంత్రి కేటీఆర్ ఛాలెంజ్‌ స్వీకరించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ సోమ‌వారం (జూలై-30) త‌న కూతురు సితార‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

తనను ఇలాంటి ఛాలెంజ్‌ కు ఆహ్వానించినందుకు కేటీఆర్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా త‌న ముద్దుల కూతురు సితార‌, కొడుకు గౌతంతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపెల్లికి ఆయ‌న హరితహారం  గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమాను వంశీ పైడిపెల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates