కేటీఆర్ ను కలిసిన యాంకర్ సుమ

హైదరాబాద్ : తెలంగాణ భవన్ లో TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును కలిశారు ప్రముఖ టీవీ యాంకర్  సుమ. కేటీఆర్ ను కలిసి ఓ మొక్కను బహుమతిగా ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం…. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడంపై ఆమె కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత పలు అంశాలపై మాట్లాడారు.

కేటీఆర్ తో భేటీ తర్వాత మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు సుమ. కేటీఆర్ తో సమావేశంలో ఏ అంశాలపై మాట్లాడారో అన్నది మాత్రం సుమ చెప్పలేదు. ‘ఓ మంచి పని కోసం కేటీఆర్ గారిని సపోర్ట్ అడిగా. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు చెబుతా” అని సుమ చెప్పి వెళ్లిపోయారు.

Posted in Uncategorized

Latest Updates