నేడు రామన్నకు పట్టాభిషేకం : వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు

కేటీఆర్  పట్టాభిషేకానికి  అంతా  రెడీ అయింది.  టీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ గా  ఇవాళ డిసెంబర్-17న బాధ్యతలు  చేపట్టనున్నారు.  ఈ కార్యక్రమానికి  పెద్ద సంఖ్యలో  హాజరు కానున్నారు నేతలు, కార్యకర్తలు. తెలంగాణభవన్ లో జరిగే కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు.  ఉదయం 10 గంటలకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ జరగనుంది. జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

మాజీ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాల వేస్తారు కేటీఆర్. 11 గంటల 56 నిమిషాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపడతారు. ఆతర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తల నుద్దేశించి కేటీఆర్ మాట్లాడతారని చెప్పారు నేతలు.  కార్యక్రమం సందర్భంగా తెలంగాణ భవన్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు పోలీసు అధికారులు.

 

Posted in Uncategorized

Latest Updates