కేటీఆర్ బర్త్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ

మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా మాదాపూర్ లో.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం – ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అనే నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. శేరిలింగంపల్లి నల్లగండ్ల నుంచి.. మాదాపూర్ మీదుగా ప్రగతి భవన్ వరకు 300 సైకిళ్లతో ర్యాలీని నిర్వహించారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిఫై కేటీఆర్ ముందుచూపుతో పనిచేస్తున్నారని అన్నారు నేతలు. బంగారు తెలంగాణ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ తో కలిసి పనిచేస్తామన్నారు.

Posted in Uncategorized

Latest Updates