కేటీఆర్ బస్తీమే సవాల్ : ఉత్తమ్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు

ktr-uttam2019 ఎన్నికల్లో TRS అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే మాటకు కట్టుబడి ఉంటానన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్. ఈ సవాల్ ను స్వీకరిస్తే పీసీసీ చీఫ్ ఉత్తమ్ దైర్యంగా ముందుకు రావాలన్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి కాంగ్రెస్ కు సవాల్ చేశానని మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశారు. కుటుంబం చాటున రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. తన సవాల్ ను స్వీకరించే దమ్ము ఉత్తమ్ కు ఉన్నా.. లేకపోయినా తాను మాటపై నిలబడతానని స్పష్టం చేశారాయన.

నల్గొండలో ఫ్లోరోసిస్ పాపానికి కాంగ్రెసే కారణమన్నారు. మిషన్ భగీరథతో వాళ్ళందరికీ మంచి నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారాయన. ఉద్యోగాలు ఇవ్వలేని KCR దద్దమ్మ అంటున్నారని… రాహుల్ ను మించిన దద్దమ్మ దేశంలో ఎవరన్నా ఉన్నారా అని ప్రశ్నించారు KTR. ఉత్తమ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. CM పదవి కోసం నరమేధాలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని నిలదీశారు. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ వాళ్లా మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. నల్గొండలో జరిగిన హత్య TRS వాళ్లు చేయించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. TRS తలుపు తట్టీ… తట్టీ పోయడని.. ఆయన కూడా ఎలా మాట్లాడతారంటూ చురకలు అంటించారు.

బడ్జెట్లో అన్యాయం చేసిన BJPకి ప్రజలే తగిన సమయంలో బుద్ది చెప్తారన్నారు కేటీఆర్.  మనం ఎన్ని చెప్పినా మోడీ వినేది ఏమీ లేదన్నారు. మనది ఒన్ సైడ్ లవ్ అన్నారు. కోదండరాంతో సహా ఎవరైనా పార్టీ పెట్టొచ్చన్నారు కేటీఆర్. 2019 ఎన్నికల తర్వాత జనం ఎవరిని ఆదరిస్తారో చూద్దామన్నారు. ప్రజల సాధక బాధలు… ప్రాంతీయ పార్టీలకే తెలుస్తాయన్నారు. మిత్రపక్షాలను కూడా కేంద్రం మెప్పించలేక పోయిందన్నారు. రాష్ట్రం నుంచి రూ.40 వేల కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి పంపితే.. కేవలం వెయ్యి కోట్లు కూడా రాలేదన్నారు. బాహుబలి మూవీ కలెక్షన్ కూడా రాలేదని సెటైర్ వేశారు కేటీఆర్. రాష్ట్ర పథకాలను కేంద్ర మంత్రులు వచ్చి అద్భుతం అనటం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరంతో సహా ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ కేంద్రాన్ని అడిగినా స్పందించలేదన్నారు. ఆందోళన చేస్తున్న మిత్రపక్షం టీడీపీనే.. బీజేపీ పట్టించుకోవటం లేదన్న కేటీఆర్.. మనం ఆందోళన చేస్తే ఇస్తారా అన్నారు. ఢిల్లీకి వెళ్తున్నానని.. మరోసారి కేంద్రమంత్రులను కలుస్తానని చిట్ చాట్ లో చెప్పారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates