కేదార్ నాథ్ స్కూల్స్ లో సౌండ్ ఫ్రూఫ్ సిస్టమ్

మంచు కొండల్లో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు కేదార్‌నాథ్‌ కు జనం భారీ సంఖ్యలో వస్తుంటారు. అయితే ఆ ప్రాంతానికి చేరుకోవడానికి సరైన మార్గం లేకపోవడంతో భక్తులను అక్కడికి హెలికాఫ్టర్లలో తీసుకెళుతుంటారు.  హెలికాఫ్టర్లు వెళ్లే సమయంలో వచ్చే శబ్ధంతో సమీప పాఠశాల్లోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చెవులు చిల్లు పడేలా వచ్చే ఆ సౌండ్ తో వారు సరిగ్గా చదువు పై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. టీచర్స్ కూడా గట్టిగా అరచి పాఠాలు చెప్పాల్సి వస్తుండటంతో ఉపాధ్యాయులు,విద్యార్ధులు  సమస్యను  జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో రుద్రప్రయాగ్ జిల్లా అధికారులు హెలికాఫ్టర్ సేవలు అందిస్తున్న సంస్థలను కలిసి సమస్యను వివరించారు. జిల్లా అధికారులు,సంస్థల ప్రతినిధులు మధ్య జరిగిన చర్చల తర్వాత  హెలిప్యాడ్లకు దగ్గర్లో ఉన్న తొమ్మిది పాఠశాలల్లో సౌండ్‌ప్రూఫ్‌ గదులను నిర్మించేందుకు  ఆ కంపెనీలు అంగీకరించాయి.  కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) నిధులతో ఆయా సంస్థలు ఒక్కో పాఠశాలలో రెండు సౌండ్ ఫ్రూవ్ గదులను కట్టిస్తున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates