కేప్‌టౌన్‌: సఫారీలతో రేపు మూడో వన్డే

ind-vs-saదక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో… టీమిండియా మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెండు వరుస వన్డేల్లో గెలిచి 2-0 ఆధిక్యం సాధించిన భారత జట్టు.. మూడో వన్డేలో కూడా విజయం సాధించి మరింత ముందుకు దూసుకుపోవాలని భావిస్తోంది. బుధవారం(ఫిబ్రవరి-7) కేప్‌టౌన్‌ వేదికగా రెండు జట్ల మధ్య సాయంత్రం గం. 4.30 ని.లకు మూడో వన్డే జరగనుంది. డర్బన్‌లో జరిగిన మొదటి  వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్లతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఈ రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని కోహ్లి సేన మూడో వన్డేలో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

 

Posted in Uncategorized

Latest Updates