కేరళను ముంచెతుత్తున్న భారీ వర్షాలు

నైరుతి రుతు పవనాల ప్రభావంతో కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఇడుకి, వేనాడ్, కోజికోడ్ జిల్లాల్లో వర్షాలకు కొండ చరియలు విరిగి పడి రోడ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇళ్లలోకి నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలపై అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. అధికారులు ముందుస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశాలు జరీ చేసింది. కన్నూరు, కోజికోడ్, కొట్టాయం, అలప్పుజా జిల్లాల్లో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు అధికారులు. వర్షాల కారణంగా రాష్ట్రంలో రైళ్లను నిలిపివేయడంతో పాటు.. కొట్టాయం, అలఫుజ, కోజికోడ్‌ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates