కేరళ నన్ పై రేప్ కేసు : బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ బెయిల్ పిటీషన్ తిరస్కరణ

కేరళ నన్ పై లైంగిక దాడి కేసులో అరెస్టయిన జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ ను ఈనెల 24 వరకూ పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ శనివారం(సెప్టెంబర్-22)  న్యాయస్ధానం ఉత్తర్వులు జారీ చేసింది. ములక్కల్‌ బెయిల్‌ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.

పోలీసుల రిమాండ్ నివేదిక ప్రకారం.. 2014 మే 5న బిషప్ స్కూలుకు వచ్చాడు. లైంగికంగా వేధించే ఉద్దేశంతోనే  బాధిత నన్‌ ను గెస్ట్‌ హౌస్‌లోని రూమ్ నెం 20కి పిలిపించి రాత్రి 10:48 గంటలకు వరకు అక్కడే ఉంచాడు. ఆమెపై అసహజ శృంగారానికి బిషప్ యత్నించాడు. విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బాధితురాలిని హెచ్చరించాడు. తర్వాతి  రోజు మే- 6న కూడా బాధితురాలిపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని నివేదికలో ప్రస్తావించారు. 2014 నుంచి 2016 వరకూ అదే గదిలో బాధితురాలిపై నిందితుడు 13 సార్లు లైంగిక దాడి, అసహజ శృంగారానికి పాల్పడ్డాడని తెలిపారు.

 

Posted in Uncategorized

Latest Updates